Breaking: ఎస్. రాయవరంలో ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరంలో సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు...

Breaking: ఎస్. రాయవరంలో ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం(Anakapalle District S. Rayavaram)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేస్తోన్న బల్క్ డ్రగ్ పార్క్‌(Bulk Drug Park)ను ప్రజలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాట నేత‌ అప్పలరాజుపై పీడీ యాక్ట్‌(PD Act) నమోదు చేయడంపై సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్. రాయవరం మండలంలో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో బంద్ నిర్వహించేందుకు సీపీఎం నాయకులు, కార్యకర్తలు ప్రయత్నం చేశారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం సహా పలువురని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాట నేత‌ అప్పలరాజుపై నమోదు చేసిన పీడీయాక్ట్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.

Next Story