విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి

by Thanuru Gopichand |

విశాఖ ఉక్కు (Vizag Steel) కర్మాగారంలో దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి (Accident) గురైన ఓ కార్మికుడు మృతి చెందడంతో విషాదం నెలకొంది.

విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖ ఉక్కు (Vizag Steel) కర్మాగారంలో దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి (Accident) గురైన ఓ కార్మికుడు మృతి చెందడంతో విషాదం నెలకొంది. పోలీసుల సమాచారం ప్రకారం గణేశ్ (Ganesh) అనే కార్మికుడు కాంట్రాక్ట్ పద్ధతిన విశాఖ ఉక్కు కర్మాగారంలో పని చేస్తున్నారు. కర్మాగారంలో రైలు అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితుడు ప్రాణాలు విడిచాడు. యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story