విశాఖ ప్రేమోన్మాది ఘాతుకంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

by velandi.Saikiran |

విశాఖలో ( Visakapatnam) ప్రేమోన్మాది ఘాతుకం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( CM Chandrababu

విశాఖ ప్రేమోన్మాది ఘాతుకంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
X

దిశ వెబ్ డెస్క్: విశాఖలో ( Visakapatnam) ప్రేమోన్మాది ఘాతుకం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( CM Chandrababu naidu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ విశాఖపట్నంలో యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. ఈ సంఘటనలో యువతి తీవ్ర గాయాల పాలు కాగా.. ఆమె తల్లి మరణించినట్లు సమాచారం అందుతోంది.


అయితే.. ప్రియురాలి కుటుంబంపై దాడి చేసిన నవీన్ ( Naveen)... అక్కడి నుంచి పారిపోయాడు. శ్రీకాకుళంలో ( Srikakulam) నవీన్ మొబైల్ ఫోన్ సిగ్నల్ ద్వారా.... అతన్ని ట్రెజ్ చేశారు పోలీసులు. అనంతరం అతన్ని పట్టుకున్న పోలీసులు... విచారణ చేస్తున్నారు. అయితే ఈ సంఘటనపై కాసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సంఘటనలో యువతి తల్లి నక్క లక్ష్మీ ప్రాణాలు కోల్పోవడం విచారకరమని వెల్లడించారు. బాధిత యువతికి... మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో నిందితుడు పై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై హోంమంత్రి అనిత (Anitha) కూడా స్పందించారు. నిందితుడికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు అనిత. ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూస్తామని పేర్కొన్నారు.

Next Story