- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Visakha: ఎంపీ కుటుంబాన్నే రక్షించలేనోళ్లు.. రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారు?
విశాఖ బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. ..

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ బీజేపీ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలపై బీజేపీ విశాఖలో సభలో మాట్లాడితే వైసీపీ మంత్రులు, నేతలు మీడియా ముందు గగ్గోలుపెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఏకంగా వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారని తెలిపారు. వైసీపీ ఎంపీ కుటుంబాన్ని రక్షించలేనోళ్లు రాష్ట్రాన్ని ఏం రక్షిస్తారని ప్రశ్నించారు. తప్పును ఒప్పుకొని బీజేపీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని విష్ణువర్థన్ రెడ్డి హితవు పలికారు.
కాగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యులు కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు చేశారు. నిందితుల్లో హేయంత్ అనే వ్యక్తి గతంలో ఎంపీ వద్ద పని చేశారు. ఆ పరిచయంతోనే ఎంపీ భార్య, కొడుకు, ఆడిటర్‌ను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. రూ. 1.7కోట్లు తీసుకుని పారిపోయే యత్నం చేయడంతో పోలీసులు ఛేజ్ చేసి మరీ నిందితులను పట్టుకున్నారు. ఇక వ్యవహారంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి స్పందించారు. విశాఖ శాంతి భద్రతల దృష్ట్యా తీవ్ర విమర్శలు కురిపించారు.






