- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీతాలు ఇవ్వలేని మీరా.. నడ్డాని విమర్శించేది!
విశాఖ ఎటు చూసినా భూ కబ్జాలు, ఆక్రమణలేనని బీజేపీ నేత సత్యకుమార్ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఎటు చూసినా భూ కబ్జాలు, ఆక్రమణలేనని బీజేపీ నేత సత్యకుమార్ అన్నారు. బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పాలనా రాజధాని పేరుతో విధ్వాంసాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక, గనులు, మద్యంలో అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. నడ్డా 4 ప్రశ్నలు వస్తే వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. జల్ జీవన్ మిషన్‌కు రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటా ఇవ్వడంలేదని ధ్వజమెత్తారు. పోలవరం నిధుల్లో కమీషన్లు కొట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని తమరు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను విమర్శిస్తారా అని సత్యకుమార్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి:
Visakha: సీఎం జగన్‌ను ఇంటికి పంపించండి.. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు






