AP | బస్సులో పొగలు.. పాసింజర్లకు ఇబ్బందులు

by Thanuru Gopichand |

ఆర్టీసీ బస్సులో పొగలు చెలరేగిన ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది.

AP | బస్సులో పొగలు.. పాసింజర్లకు ఇబ్బందులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆర్టీసీ బస్సులో పొగలు చెలరేగిన ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని పాడేరు (Paderu) నుంచి మంపకు ఆర్టీసీ బస్సు (RTC Bus) ప్రయాణికులతో బయలుదేరింది. మార్గం మధ్యలో కొక్కరపల్లి (Kokkarapalli) ఘాటీ సమీపంలోకి వెళ్లగానే సాంకేతిక సమస్యల కారణంగా బస్సులో నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. ఇది గమనించి అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ప్రయాణికులందరినీ బస్సులో నుంచి దింపివేశాడు. డ్రైవర్ అప్రమత్తతో ఎటువంటి దుర్ఘటన జరగలేదు. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. అనంతరం వారిని మరో బస్సులోకి ఎక్కించి అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే ఇటీవల బస్సు ప్రమాదాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో బస్సులోని ప్రయాణికులు (Passengers) కొంత భయాందోళనలకు గురయ్యారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో తరచూ ఆర్టీసీ బస్సులు మొరాయిస్తున్నాయని చెబుతున్నారు. మంచి బస్సు సర్వీసులను నడపాలని కోరుతున్నారు. తద్వారా భవిష్యత్తుల ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.


Next Story