AP : మరో ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

by Thanuru Gopichand |

అల్లూరి సీతారామరాజు (Alluri Sitharamaraju District) జిల్లాలోని మరో గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగులోకి వచ్చింది.

AP : మరో ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లూరి సీతారామరాజు (Alluri Sitharamaraju District) జిల్లాలోని మరో గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం ఆశ్రమ పాఠశాలలో (Gurukul) ఫుడ్ పాయిజనింగ్ (Food Poisoning) జరిగింది. దీని వల్ల అక్కడ ఉంటున్న 22 మంది బాలికలు బాధితులుగా మారారు. వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వారిని పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు వారికి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.

ఇటీవల..

అయితే నవంబరు 13న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీకేవీధి మండలం జెర్రెల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. రాత్రి భోజనం తరువాత విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో విలవిలలాడారు. 29 మంది విద్యార్థులకు సీరియస్ కావడంతో తక్షణమే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Next Story