- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులకు గమనిక.. రెగ్యులర్ సర్వీసుగా అనకాపల్లి-సికింద్రాబాద్ రైలు
అనకాపల్లి-సికింద్రాబాద్ మధ్య నడిచే వీక్లీ ప్రత్యేక రైలును రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ రైల్వే బోర్డు ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ...

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి-సికింద్రాబాద్(Anakapalli-Secunderabad) మధ్య నడిచే వీక్లీ ప్రత్యేక రైలు(Weekly Special Train)ను రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ రైల్వే బోర్డు(Railway Board) ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అప్‌గ్రేడ్ అయిన ఈ రెగ్యులర్ రైలు సర్వీసును అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్(Mp Cm Ramesh) అధికారికంగా ప్రారంభించారు. ఈ మార్పు వల్ల ఉత్తరాంధ్ర(Uttarandra), తెలంగాణ(Telangana) ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుందని ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. అయితే గతంలో ప్రత్యేక రైలుగా పరిమితంగా సేవలందించిన ఈ రైలు.. ఇకపై శాశ్వత ప్రాతిపదికన ప్రయాణికులకు అందుబాటులో ఉండనుందని ఆయన చెప్పారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుందని, దీనివల్ల నిరంతర ప్రయాణ సౌకర్యం లభిస్తుందని ఎంపీ సీఎం రమేశ్ పేర్కొన్నారు.






