20 రూపాయల కోసం తోటి విద్యార్థి గొంతు కోశాడు

by Thanuru Gopichand |

20 రూపాయల కోసం తనతో పాటు చదువుకుంటున్న తోటి విద్యార్థి గొంతును పదునైనా వస్తువుతో కోశాడు ఓ విద్యార్థి.

20 రూపాయల కోసం తోటి విద్యార్థి గొంతు కోశాడు
X

దిశ, వెబ్ డెస్క్ : 20 రూపాయల కోసం తనతో పాటు చదువుకుంటున్న తోటి విద్యార్థి గొంతును పదునైనా వస్తువుతో కోశాడు ఓ విద్యార్థి. ఈ దుర్ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు వ్యాలీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే అరకు వ్యాలీలోని ఒక పాఠశాలలో 14 ఏళ్ళ బాలుడు చదువుతున్నాడు. అతను ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో బుధవారం మద్యం సేవించి అరకు గ్రామంలో తచ్చాడుతున్నాడు. అటుగా వెళ్తున్న తన తోటి విద్యార్థులను అడ్డుకున్నాడు. తనకు 20 రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే వారు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో కోపానికి గురైన ఆ విద్యార్థి వారిలో ఒకరిపై పదునైన వస్తువుతో దాడి చేసి గొంతు కోశాడు. ఆ తరువాత భయపడి తన గొంతును కూడా కోసుకున్నాడు. అయితే ఈ ఘటనలో ఎవరికి ప్రాణ హాని జరగలేదని వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం గాయపడిన విద్యార్థులను డిశ్చార్జ్ చేశారు. దుర్ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యానికి బానిసైన విద్యార్థిని డీ అడిక్షన్ సెంటరుకు తరలించనున్నారు.

Next Story