- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL cricket mach: ఐపీఎల్ మ్యాచ్లకు విశాఖ స్డేడియం రెడీ
వైజాగ్ లోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న అభివృద్ది పనులను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్మం గళవారం పరిశీలించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వైజాగ్ లోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ-వీడీసీఏ) స్టేడియంలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న అభివృద్ది పనులను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (kesineni) మంగళవారం పరిశీలించారు. ఈ మేరకు ఎంపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈనెల 24, 30వ తేదీల్లో వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరగబోయే ఐపీఎల్ క్రికెట్ (IPL cricket) మ్యాచులకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. గ్రౌండ్ కెపాసిటీ మినహాయిస్తే అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం తర్వాత అంతర్జాతీయ స్థాయిలో వైజాగ్ క్రికెట్ స్టేడియం తయారు కానున్నట్లు తెలిపారు. గ్యాలరీలో నూతనంగా ఏర్పాటు చేసిన కార్పొరేట్ బ్యాక్సులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఐపీఎల్ మ్యాచ్ జరగబోయే సమయాన్ని గ్రౌండ్ కార్పొరేట్ స్టైల్ లో సరికొత్త రూపులో క్రికెట్ అభిమానులకు కనిపిస్తుందని సిబ్బంది వివరించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ వెంకటరామ ప్రశాంత్, కోశాధికారి దండుమూడి శ్రీనివాస్ , కౌన్సిలర్ దంతు గౌరు విష్ణుతేజ్ లతో పాటు వైజాగ్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.






