రాష్ట్రంలో స్టైలీష్ దొంగ: పగలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. రాత్రిళ్లు చోరీలు..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-07 12:14:39  IST  )

విశాఖ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మహేశ్ రాత్రి అయితే దొంగతనాలకు పాల్పడ్డారు...

రాష్ట్రంలో స్టైలీష్ దొంగ: పగలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. రాత్రిళ్లు చోరీలు..!
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మహేశ్(Software employee Mahesh) అలియాస్ సన్నీరాత్రి అయితే దొంగతనాలకు పాల్పడ్డారు. పగలంతా ఎంత సిన్సియర్‌గా ఉద్యోగం చేస్తారో రాత్రి అయితే చాలు ముసుగు దొంగగా మారిపోతారు. చేతిలో ఐరన్ రాడ్డు, నెత్తికి టోపీ, ముఖానికి మాస్కు ధరించి గుట్టు చప్పుడు కాకుండా ఇళ్లలో చోరీలు పాల్పడతారు. ఆ డబ్బులతో విలాసంగా గడుపుతారు. ఇలా రాష్ట్రంలో మహేశ్‌పై 32 చోరీ కేసులున్నాయి. ఓ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో 14 నెలలపాటు శిక్ష కూడా అనుభవించారు. 15 ఏళ్ల వయసులోనే నాలుగు ఉన్నాయి. జువైనల్ హోమ్ నుంచి విడుదల అయిన తర్వాత కూడా చోరీలకు పాల్పడ్డారు. కాకినాడ, సర్పవరం, రామచంద్రాపురం, ఇంద్రాల, పాలెం రాజమండ్రి పోలీస్ స్టేషన్లపై మహేశ్‌పై కేసులున్నాయి. రాష్ట్రంలో దొంతనాలు చేయడం హైదరాబాద్‌లో విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. ఎట్టకేలకు మహేశ్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 699 గ్రాముల బంగారం, 3 కేజీలకు పైగానే వెండి, బీఎమ్ డబ్ల్యూ కారు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.

Next Story