- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అద్భుత దృశ్యం.. 30.16 కిలోమీటర్ల మేర యోగాసనాలు.. ఈ డ్రోన్ వీడియో చూశారా..
విశాఖపట్నంలో జూన్ 21న నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు (International Yoga Day Celebrations) గొప్ప విజయాన్ని సాధించాయి. ఒకవైపు సాగరతీర అలలు, మరోవైపు జన సంద్రమైన బీచ్ రోడ్డుతో ఆ ప్రాంతం యోగాంధ్ర (Yogandhra 2025) కోలాహలంతో మార్మోగిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంలో జూన్ 21న నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు (International Yoga Day Celebrations) గొప్ప విజయాన్ని సాధించాయి. ఒకవైపు సాగరతీర అలలు, మరోవైపు జన సంద్రమైన బీచ్ రోడ్డుతో ఆ ప్రాంతం యోగాంధ్ర (Yogandhra 2025) కోలాహలంతో మార్మోగిపోయింది.
ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకూ సుమారు 30.16 కిలోమీటర్ల మేర విస్తరించిన ప్రధాన రోడ్డుపై 3.19 లక్షల మంది ఒకేసారి యోగా చేయడం ద్వారా ఓ అద్భుత దృశ్యాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమం ద్వారా విశాఖపట్నం గిన్నిస్ వరల్డ్ రికార్డులో (Guinness World Record) స్థానం దక్కించుకుంది.
ప్రతి పిలుపుకు స్పందించిన యోగా అభ్యాసకుల ఉత్సాహం, పాలకుల క్రమశిక్షణ, ప్రజల భాగస్వామ్యం ఈ విజయానికి మూలకారణం. విశాఖలో ఇలా ఘనంగా జరిగిన యోగాంధ్ర వేడుకలకు సంబంధించిన దృశ్యాలు టీడీపీ తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేయగా, ఆ వీడియో ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ యోగా ప్రదర్శన కేవలం ఓ రికార్డు మాత్రమే కాక, ప్రపంచానికి భారతీయ యోగా సంస్కృతిని గర్వంగా చాటిన ఘట్టంగా నిలిచింది.






