- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం(Visakhapatnam) చరిత్రను తిరగరాసింది. ఫుల్ కిక్కుతో ఉక్కు సిటీ ఉర్రూతలూగిపోయింది. ఒక్క రోజులోనే అంతా మారిపోయింది. ఎప్పుడూ రానంత కిక్కు ఈ న్యూఇయర్‌కు వచ్చింది. దెబ్బతో కాసుల గలగలే..
గ్రాండ్‌గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
ఎంతో కూల్‌గా ఉండే విశాఖ నగర వాసులు ఈ న్యూ ఇయర్(New Year)ను ఫుల్ ఎంజాయ్ చేశారు. డిసెంబర్ 31ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. విందు, మందుతో చిందేశారు. దెబ్బతో సిటీ ఖాజానా ఫుల్‌గా నిండిపోయింది. ఒక్క రోజులోనే భారీ ఆదాయం వచ్చింది. మద్యం అమ్మకాలపై బుధవారం దాదాపు రూ.10 కోట్ల వచ్చినట్లు తెలిపారు. గురువారం కూడా కాసుల కల్లోలమేనని అంచనా వేశారు. విశాఖ చరిత్రలో ఇదో మైలురాయి అని అధికారులు చెబుతున్నారు. మద్యంపై ఎన్నడూ లేనంతగా ఆదాయం వచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదాయం లేని రాష్ట్రంలో న్యూ ఇయర ఇచ్చిన కిక్ అటు ప్రభుత్వ పెద్దలకు సైతం సంతోషాన్ని కలిగిస్తోంది.






