విశాఖ : చిన్నారిని రక్షించిన రైల్వే పోలీసులు

by Thanuru Gopichand |

తల్లి ఆచూకీ తెలుసుకునేందుకు విచారణ చేపట్టిన పోలీసులు.

విశాఖ : చిన్నారిని రక్షించిన రైల్వే పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : మానవీయ విలువలు నానాటికీ దిగజారుతున్నాయి. కన్నతల్లికి బిడ్డలు కూడా భారమవుతున్న రోజులు దరి చేరుతున్నాయి. కలికాలం ప్రభావమో మరింకేదైనా మహమ్మారి పీడనో రోజులు కూడా నిండని పిల్లలను తల్లులు చెత్త కుప్పల్లో, రహదారుల పక్కన ముళ్ల పొదల్లో వదిలేస్తున్నారు. అలా వదిలేసిన పిల్లల్లో కొందరు కుక్కలకు బలవుతుంటే మరికొందరు మానవతావాదుల కంట బడి బ్రతికిపోతున్నారు. మనసును కదిలించే ఇలాంటి ఘటన ఒకటి విశాఖపట్నంలో వెలుగు చూసింది. నెలలు కూడా నిండని ఓ చిన్నారిని ఓ తల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వదిలి వెళ్లింది. రైల్వే పోలీసుల జోక్యంతో ఆ చిన్నారి సురక్షితంగా చైల్డ్ లైన్ సిబ్బంది చేతుల్లోకి వెళ్లింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ (Visakapatnam Railway Station) వద్ద ఆటోలో ఓ చిన్నారిని వదిలివెళ్లారు. గేట్ నంబర్ 5 (Gate No 5) వద్ద ఓ ఆటోలో చిన్నారి ఏడుస్తున్నట్లు అక్కడి ఓ ఆటో డ్రైవర్ గుర్తించాడు. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు ఆటో వద్దకు చేరుకున్నారు. ఆర్పీఎఫ్ ఎస్ఐ వి.కీర్తి రెడ్డి (RPF SI Keethy Reddy) తన బృందంతో కలిసి చిన్నారిని రక్షించారు. సురక్షితంగా చైల్డ్ లైన్ సిబ్బందికి అప్పగించారు. ఆర్పీఎఫ్ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగాఓ మహిళ చిన్నారితో కనిపించినట్లు అందులో గుర్తించారు. ఫ్లాట్ ఫామ్ 3పై నుంచి 8వ ప్లాట్ ఫామ్ పై నుంచి బయటకు వెళ్లిపోయినట్లు నిర్ధారించుకున్నారు. శిశువుతో పాటు ఉన్న బ్యాగులో తల్లి వివరాలు, బ్యాంక్ పాస్ బుక్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

Next Story