విశాఖ | స్టీల్ ప్లాంట్ లో స్వల్ప అగ్నిప్రమాదం

by Thanuru Gopichand |

విశాఖపట్నంలోని వైజాగ్ స్లీట్ ప్లాంట్ (Vizag Steel Plant) లో పెను ప్రమాదం తప్పింది. స్టీల్ ప్లాంట్ బ్యాటరీ-1లో స్వల్ప అగ్నిప్రమాదం (Minor Fire Accident) చోటు చేసుకుంది.

విశాఖ | స్టీల్ ప్లాంట్ లో స్వల్ప అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలోని వైజాగ్ స్లీట్ ప్లాంట్ (Vizag Steel Plant) లో పెను ప్రమాదం తప్పింది. స్టీల్ ప్లాంట్ బ్యాటరీ-1లో స్వల్ప అగ్నిప్రమాదం (Minor Fire Accident) చోటు చేసుకుంది. అయితే ఉద్యోగుల అప్రమత్తతతో మంటలు వ్యాపించకుండా ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే గురువారం రాత్రి ప్లాంట్ లోని కోక్ ఓవెన్ బ్యాటరీ-1 విభాగంలో స్వల్పంగా మంటలు చెలరేగాయి. జీసీఎం గ్యాస్ పైప్ లైను నుంచి గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బ్యాటరీ వద్ద విధులు నిర్వహిస్తున్న కార్మికులు, ఉద్యోగులు ఆకస్మిక్ పరిణామంతో కాస్త కంగారు పడ్డారు. అయినప్పటికీ వెంటనే తేరుకొని మంటలు వ్యాప్తి చెందకుండా ఆపేందుకు చర్యలు చేపట్టారు. హుటాహుటిన చార్జింగ్ కారును నిలిపివేసి గ్యాస్ మంటలను వారు అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైందని వారు చెబుతున్నారు. మంటలను అదుపు చేస ఉండకపోతే అవి వ్యాపించి భారీ నష్టం సంభవించేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి హాని కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో భద్రతా ప్రమాణాలను మరింత పెంచాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.

ఇటీవలే...

ఇటీవలే డిసెంబర్ 12న ఎస్ఎంఎస్ (SMS – Steel Melting Shop) విభాగంలోని డంపింగ్ యార్డులో టర్బో లాడిల్ కార్ (TLC) ద్వారా తెచ్చిన లిక్విడ్ స్టీల్ డంపింగ్ యార్డ్‌లోకి పడే క్రమంలో, అక్కడే ఉన్న ఎండిన గడ్డి, చెత్తకు నిప్పు అంటుకుంది. దీంతో మంటలు చెలరేగి, భారీగా పొగలు వచ్చాయి. పొగలు రావడాన్ని గమనించిన ఉద్యోగులు వెంటనే అప్రమత్తమై, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని, వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన స్టీల్ మెల్టింగ్ షాప్ విభాగంలోని మెటల్ పిట్‌లో లోహపు వ్యర్థాలను డంప్ చేస్తున్నప్పుడు జరిగిందని అధికారులు తెలిపారు. ద్రవ ఉక్కు నేలపాలు కావడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని వెల్లడించారు.

Next Story