- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
టీడీపీ(TDP) నేడు కోటికి పైగా సభ్యత్వాలతో యుగ పురుషుడు, అన్న నందమూరి తారక రామారావుకు(Sr.NTR) ఘన నివాళులు అర్పిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తెలిపారు.

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ(TDP) నేడు కోటికి పైగా సభ్యత్వాలతో యుగ పురుషుడు, అన్న నందమూరి తారక రామారావుకు(Sr.NTR) ఘన నివాళులు అర్పిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఆనాడు తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం పోరాడిన అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తిరిగి భవిష్యత్తు కోసం చంద్రబాబు(CM Chandrababu) గారి నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేశారు. ప్రజలు ఇచ్చిన అఖండ విజయంతో గడిచిన ఏడు నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా పరిపాలన సాగుతోంది. అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఆయన ఆదర్శాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు సారధ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు.
తెలుగు ప్రజలు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని ఆకాంక్షిస్తూ ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో విశాఖ ఉక్కును నిర్లక్ష్యం చేశారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా నిలుపుదల చేయడమే కాకుండా భారీ ప్యాకేజీ ప్రకటించడం హర్షణీయమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రూ.11,440 కోట్ల ప్యాకేజీకి నిర్ణయంతో రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదం ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవమే అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజల తరపున ప్రధాని మోడీకి, సీఎం చంద్రబాబుకు మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.






