- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: బీజేపీలో చేరిన విశాఖ డెయిరీ అధినేత.. కొద్ది నిమిషాల్లోనే సంచలన వ్యాఖ్యలు
బీజేపీలో చేరిన వెంటనే విశాఖ డెయిరీ అధినేత అడారి ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: విశాఖ డెయిరీ అధినేత అడారి ఆనంద్(Visakha Dairy Chief Adari Anand) బీజేపీ(Bjp)లో చేరారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి(AP BJP President Daggubati Purandeswari) సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. గత ఐదేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్(YSR Congress)లో కొనసాగిన అడారి ఆనంద్.. ఇటీవల ఆ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. అడారి ఆనంద్ ఏ పార్టీలో చేరతారా అనుకుంటున్న సమయంలో బీజేపీలో చేరి అందరికీ షాక్ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పురంధేశ్వరితో భేటీ అయి బీజేపీలో చేరికపై చర్చించారు. వెంటనే ఆనంద్ రాకను స్వాగతించిన పురంధేశ్వరి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అడారి ఆనంద్ మాట్లాడుతూ బీజేపీ అధిష్టానం పిలుపుతో తాను ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. విశాఖ డెయిరీ అంటే ఆనంద్ ఒక్కడే కాదని, చాలా మంది రైతులు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని చెప్పారు. డెయిరీ అవకతవకలపై 2006లో హౌస్ కమిటీ వేశారని గుర్తు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని నిరూపిస్తానని అడారి ఆనంద్ చాలెంజ్ చేశారు.






