VIRAL: చామవరంలో పెన్షన్ల పంపిణీ.. కల్లును రుచి చూసిన సీఎం చంద్రబాబు

by Kema Shiva Kumar |

కాకినాడ జిల్లా చామవరంలో సీఎం చంద్రబాబు ఇవాళ పర్యటించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా గీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్లి రూ. 4,000 పెన్షన్ అందజేశారు.

VIRAL: చామవరంలో పెన్షన్ల పంపిణీ.. కల్లును రుచి చూసిన సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రజా క్షేత్రంలో వినూత్నంగా దూసుకెళ్తున్నారు. ఇవాళ ఆయన కాకినాడ (Kakinada) జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే పేదల ముంగిటకే పాలన తెస్తామన్న మాటకు కట్టుబడి, అధికారులతో కలిసి నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి సీఎం పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం స్థానిక కల్లుగీత కార్మికుడైన సింహాచలం నివాసాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ పథకం లబ్ధిదారుడైన సింహాచలానికి సీఎం చంద్రబాబు తన చేతుల మీదుగా రూ.4 వేల పెన్షన్ మొత్తాన్ని అందజేశారు.

తాటి చెట్టు ఎక్కిన ముసలయ్య.. కల్లు టేస్ట్ చేసిన సీఎం

అయితే, పెన్షన్ పంపిణీ అనంతరం ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. సింహాచలం మేనల్లుడు ముసలయ్య సాంప్రదాయ పద్ధతిలో తాటి చెట్టు ఎక్కి కల్లు తీసే విధానాన్ని సీఎం చంద్రబాబు ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం ముసలయ్య చెట్టు పైనుంచి నేరుగా కుండలో తీసుకొచ్చిన తాజా కల్లును సీఎం చంద్రబాబు రేక పట్టి స్వయంగా రుచి చూశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story