- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: వడ్డీకాసుల వాడికే ‘వడ్డీ’ తిప్పలు.. స్వామివారి కిరీటం రూ.38 లక్షలకు తాకట్టు
రూ.కోటి విలువైన వెంకటేశ్వర స్వామి బంగారు కిరీటాన్ని కేవలం రూ.38 లక్షలకే తాకట్టు పెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడ (Gudiwada)లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సాక్షాత్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బంగారు కిరీటాన్నే ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ ముంచేశాడు. భక్తులు దైవభక్తితో సమర్పించిన రూ.75 లక్షల విలువైన కిరీటాన్ని గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు పెట్టి నగదు డ్రా చేసుకున్న వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. గుడివాడకు చెందిన మాటూరి సుబ్బారావు దంపతులు తమ జీవితకాల సంపాదనతో ఎంతో భక్తిశ్రద్ధలతో 450 గ్రాముల బరువున్న రూ.75 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని తయారు చేయించారు. 2025 జనవరిలో స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానుకగా అందజేశారు. అయితే, స్వామివారి అలంకరణలో ఉండాల్సిన ఆ కిరీటంపై ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ పోకూరి మోహనరావు కన్ను పడింది. ఆ కిరీటాన్ని మాయం చేసిన మోహనరావు ఓ ప్రైవేట్ తాకట్టు వ్యాపారి వద్ద కేవలం రూ.38 లక్షలకే తాకట్టు పెట్టి ఆ సొమ్మును సొంతానికి వాడుకున్నాడు.
దాతల ఫిర్యాదు.. రంగంలోకి పోలీసులు
అయితే, వెంకటేశ్వర ఆలయానికి వెళ్లిన దాతలకు స్వామివారి తలపై తాము ఇచ్చిన కిరీటం లేకపోవడాన్ని గమనించారు. అనంతరం ఆలయ నిర్వాహకులను నిలదీయగా పొంతన లేని సమాధానాలు రావడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. దాతల ఫిర్యాదుతో కదిలిన పోలీస్ యంత్రాంగం నిందితుడైన ఆలయ ప్రెసిడెంట్ మోహనరావుపై తక్షణమే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘరానా మోసంపై దేవాదాయ శాఖ (Endowments Department) అధికారులు కూడా తీవ్రంగా స్పందించి రంగంలోకి దిగారు. ఆలయ రికార్డులను, లాకర్లను తనిఖీ చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో స్వామివారి కిరీటాన్ని తాకట్టు పెట్టుకున్న సదరు ప్రైవేట్ వ్యాపారి ప్రస్తుతం రాజస్థాన్ (Rajasthan)లో ఉన్నట్లు పోలీసు వర్గాలు గుర్తించాయి. కిరీటాన్ని రికవరీ చేయడానికి గుడివాడ పోలీసుల స్పెషల్ టీమ్ రాజస్థాన్‌కు బయలుదేరింది.






