భక్తులకు బిగ్ అలర్ట్.. 23న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

by Vemula.Srinu Prasad |

తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ మంగళవారం వీఐపీ దర్శనాలను రద్దు చేశారు.

భక్తులకు బిగ్ అలర్ట్.. 23న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) వెంకటేశ్వరస్వామి ఆలయం(Venkateswara Swamy Temple)లో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార ద‌ర్శనాలు(Vaikuntha Dwara Darshans) జరగనున్నాయి. దీంతో భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 23న మంగళవారం రోజున కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం(Koil Alwar Thirumanjanam) జ‌రగ‌నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అదే రోజు ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కారణంతో అష్టదళ పాద పద్మారాధన సేవను సైతం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు 22నే సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

కాగా సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story