తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. రెండ్రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు క్యాన్సిల్

by Naga Rani Yarlagadda |

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. రెండ్రోజులపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖల్ని స్వీకరించమని స్పష్టం చేసింది.

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. రెండ్రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు క్యాన్సిల్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. మార్చి 17, 19 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. 19వ తేదీన ఉగాది పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు అష్టాదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 16వ తేదీన ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలను స్వీకరించబోమని స్పష్టం చేసింది. మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అంటే.. 18న వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు స్వీకరించరు. ఈ విషయాలను గమనించి భక్తులు సహకరించాలని టీటీడీ కోరింది.

Next Story