- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైవరు హత్య కేసులో వినుత కోటకు బెయిల్
by Thanuru Gopichand |
శ్రీకాళహస్తిలో సంచలనం సృష్టించిన డ్రైవరు రాయుడు హత్య కేసులో జనసేన మాజీ నేత వినుత కోటకు ఈ నెల 6న చైన్నై హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

X
దిశ, చిత్తూరు: శ్రీకాళహస్తిలో సంచలనం సృష్టించిన డ్రైవరు రాయుడు హత్య కేసులో జనసేన మాజీ నేత వినుత కోటకు ఈ నెల 6న చైన్నై హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వినుత కోట మూడవ నింది తురాలిగా ఉంది. జూలై 7న శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే తన డ్రైవరును వినుత కోట దంపతులు హత్య చేశారనే అభియోగంపై తమిళనాడు పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ-గా చంద్రబాబు (వినుత భర్త), ఏ-2గా షేక్ తాసర్, ఏ-3గా వినుత కోట, ఏ-4గా శివకుమార్, ఏ-5గా గోపి ఉన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు వినుతకు మాత్రమే న్యాయస్థానం వారు బెయిల్ మంజూరు చేశారు. విడుదలైన వినుత కోట అక్కడే పోలీసు స్టేషన్ రోజూ సంతకాలు చేయాల్సి ఉంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వినుత కోట చెన్నైలోనే పోలీసు స్టేషనులో సంతకాలు చేయాల్సి ఉంటుంది.
Next Story






