వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ.. అన్నీ జగనే : ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2024-10-10 09:42:34  IST  )

త్వరలోనే వైసీపీ పతనం కావడం ఖాయమని, ఇది జగన్ చేజేతులా చేసుకున్నదని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు.

వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ.. అన్నీ జగనే : ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగనేనని టీడీపీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. టీడీపీ రెడ్ బుక్ మాదిరిగానే తాముకూడా ఏదో బుక్ రాస్తున్నట్లు జగన్ చెప్పారన్న ఆయన.. ఆ బుక్ రాసే బదులు రామకోటి రాస్తే పుణ్యమైనా వస్తుందన్నారు. జగన్ కలలో కూడా రెడ్ బుక్కే వస్తున్నట్లుందని, అందుకే ఎక్కడికెళ్లినా దానినే కలవరిస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే వైసీపీ దుకాణం మూతపడటం కారణమని, ఇది జగన్ చేజేతులా చేసుకున్న పతనం అని చెప్పారు.

Next Story