వికసిత్ ఏపీ - 2047 విజన్ డాక్యుమెంట్ తయారీకి కార్యాచరణ.. ఏపీ సీఎస్

by Geesa Chandu |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 2 వ తేదీన.. వికసిత్ ఏపీ - 2047 కు సంబంధించి, విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించేలా కార్యాచరణ చేపట్టినట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు.

వికసిత్ ఏపీ - 2047 విజన్ డాక్యుమెంట్ తయారీకి కార్యాచరణ.. ఏపీ సీఎస్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 2 వ తేదీన.. వికసిత్ ఏపీ - 2047 కు సంబంధించి, విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించేలా కార్యాచరణ చేపట్టినట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా.. విజయం డాక్యుమెంట్ ను రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు. 2047 నాటికి, 2 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా, ఏపీని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నట్లు సీఎస్ తెలిపారు. ఈ నెల 28 న జరిగే మంత్రి మండలి సమావేశంలో.. విజన్ డాక్యుమెంట్ 2047 కు సంబంధించి ప్రతిపాదన చేయనున్నట్లు తెలిపారు. అయితే సెప్టెంబర్ 1 నుండి 15 వరకూ.. విజన్ డాక్యుమెంట్ పై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు సేకరిస్తామని, సెప్టెంబర్ 10-15 మధ్యలో మండల, మున్సిపల్, గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు జరుపుతామని సీఎస్ అన్నారు. వచ్చే నెలలో 10 నుంచి 14 తేదీలలో ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు పోటీల నిర్వహణ కూడా ఉంటుందని, అలాగే వచ్చే నెల 15 నుంచి 24 ల మధ్య, ఏపీ విజన్ 2047 ముసాయిదా ఖరారు జరుగుతుందని వెల్లడించారు. చివరగా సెప్టెంబర్ 25 న.. వికసిత్ ఏపీ విజన్ తుది ముసాయిదాను సమర్పిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.

Next Story