- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లపై తీర్పు వాయిదా.. కారణం ఇదే..!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లపై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వాయిదా వేసింది...

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Gannavaram Former Mla Vallabhaneni Vamsi) కస్టడీ, హెల్త్ పిటిషన్లపై విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు(Vijayawada SC, ST Court) తీర్పు వాయిదా వేసింది. ఈ రోజు తీర్పు ఇస్తున్నట్లు గత విచారణలో కోర్టు తెలిపింది. అయితే ఈ తీర్పును సోమవారానికి వాయిదా వేస్తూ ఆదేశించింది. మరోవైపు వంశీ బెయిల్ పిటిషన్(Bail Pittion)పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలుకు పోలీసులు సమయం కోరడంతో కోర్టు ఓకే చెప్పింది. విచారణను వాయిదా వేసింది.
కాగా గన్నవరం టీడీపీ కార్యాలయం(Tdp Office)పై వైసీపీ శ్రేణుల(Ycp Leaders) దాడి కేసులో వల్లభనేని వంశీపై ఆరోపణలున్న విషయం తెలిసిందే. అయితే ఈ దాడిపై టీడీపీ కార్యాలయం కంప్యూటర్ అపరేటర్ సత్యవర్థన్ ఫిర్యాదు చేశారు. కానీ ఇటీవల కోర్టులో జరిగిన విచారణలో కేసు వాపస్ తీసుకుంటున్నట్లు తెలిపారు. సాక్షిగా ఉన్న తనను పోలీసులే ఫిర్యాదుదారుడిగా నమోదు చేశారని చెప్పారు. దీంతో ఈ కేసు ములుపు తిరిగింది.
ఇదిలా ఉండగా సత్యవర్థన్ సోదరుడు కోటి విజయవాడ కృష్ణలంక పోలీసులను ఆశ్రయించారు. తన సోదరుడు సత్యవర్థన్‌ను వల్లభనేని వంశీ అనుచరులు బెదిరించడం వల్లే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును వెనక్కి తీసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టడంతో పలు కీలక ఆధారాలు లభించాయి. సత్యవర్థన్‌ను వల్లభనేని వంశీ అనుచరులు ఆటోలో తీసుకెళ్తున్న సీసీ ఫుటేజ్ కెమెరా వీడియోలు పోలీసులకు లభ్యమయ్యాయి.
దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో సత్యవర్థన్ కిడ్నాప్ వ్యవహారంలో ప్రధాన సూత్రదారి వల్లభనేని వంశీగా తేలింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అంతేకాదు గన్నవరంలో అక్రమ కూల్చివేతలకు సంబంధించిన కేసులోనూ వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. ఇవేకాక మరిన్ని కేసుల్లోనూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.






