విజయవాడలో పోలీసుల విస్తృత తనిఖీలు : కారులో రూ.2 కోట్ల నగదు స్వాధీనం

by Naga Rani Yarlagadda |

విజయవాడలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్ల నగదు పట్టుబడింది.

విజయవాడలో పోలీసుల విస్తృత తనిఖీలు : కారులో రూ.2 కోట్ల నగదు స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ అంబాపురం బైపాస్ రోడ్డు వద్ద బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని బరంపురం నుంచి విజయవాడకు ఈ నగదును తరలిస్తున్నట్లుగా గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తులు ఆ నగదుకు సంబంధించి సరైన ధృవీకరణ పత్రాలు చూపకపోవడంతో అది హవాలా సొమ్ము అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుకున్న సొమ్మును ఐటీ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.

Next Story