Vijayawada | డ్రగ్స్ వద్దు బ్రో.. సైకిల్ తొక్కు బ్రో

by Thanuru Gopichand |   (  Updated:2025-11-23 04:14:41  IST  )

ఏపీ పోలీసు (AP Police) శాఖలోని ఈగల్ విభాగం ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ (Anti Drugs Rally) నిర్వహించారు.

Vijayawada | డ్రగ్స్ వద్దు బ్రో.. సైకిల్ తొక్కు బ్రో
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ పోలీసు (AP Police) శాఖలోని ఈగల్ విభాగం ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ (Anti Drugs Rally) నిర్వహించారు. విజయవాడ సింగ్ నగర్ లో జరిగిన ర్యాలీలో రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. సైకిల్ తొక్కుతూ ర్యాలీని ప్రారంభించారు. ఈగల్ ఐజీ రవిక్రిష్ణ, విజయ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో.. సైకిల్ తొక్కు బ్రో అనే నినాదంతో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత డ్రగ్స్ కు బానిసలు కావడం వల్ల జాతీయ సంపదకు, యువత భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతోందన్నారు. డ్రగ్స్ కు బానిసలుగా మారి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ నిర్మూలకు ఏపీ ప్రభుత్వం యుద్ధభేరి మోగించిందన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోనుకున్నామని ప్రకటించారు.

Next Story