Kesineni Nani: టీడీపీలో అసంతృప్తిగా లేను.. ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
Vijayawada MP Kesineni Nani says he is happy with TDP
X

దిశ, వెబ్‌డెస్క్: Vijayawada MP Kesineni Nani says he is happy with TDP| తాను టీడీపీలో అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. తాను టీడీపీలో అసంతృప్తిగా లేనని, మీడియా తనను ఫోకస్ చేయవద్దని సూచించారు. తన కారుపై మాత్రమే ఎంపీ స్టిక్కర్ ఉంటుందని, అందులో తన కూతురిని కూడా తిరగనివ్వనని అన్నారు. తాను ఎంపీగా ఉన్నా, లేకపోయినా విజయవాడకు నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం ప్రైవేట్ వ్యవహారం కాదని, మహిళలకు సంబంధించిన విషయమని కేశినేని నాని చెప్పారు. కేశినేని భవన్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నాని పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు.

ఇది కూడా చదవండి: సంక్షేమ పథకాలతో ప్రభుత్వాన్ని నడపడం సరికాదు.. పవన్‌ కళ్యాణ్

Next Story

Most Viewed