వీఐపీ అయినా.. వీవీఐపీ అయినా టికెట్ ఉండాల్సిందే: ఈవో

by Gantepaka Srikanth |

భక్తుల సౌకర్యార్థం విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.

వీఐపీ అయినా.. వీవీఐపీ అయినా టికెట్ ఉండాల్సిందే: ఈవో
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ(Vijayawada Kanakadurgamma Temple) అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు టికెట్ తప్పనిసరి చేశారు. రోజుకు 300 మంది సిఫార్సు లెటర్‌తో టికెట్ లేకుండా దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆలయ ఆదాయానికి భారీగా గండిపడే ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులు ముందస్తుగా అప్రమత్తం అయ్యారు. ఆదాయానికి గండి పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు.. భక్తుల సౌకర్యార్థం విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే ఇంద్రకీలాద్రి ఆలయంలో కూడా ఉచిత లడ్డు ప్రసాద విధానాన్ని ప్రారంభించారు. 500 రూపాయల మంత్రాలయ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు ఇకపై లడ్డు ప్రసాదాన్ని నేరుగా టికెట్ స్కానింగ్ వద్దనే ప్రసాదం అందజేయమన్నారు. దర్శనానికి వెళ్లే సమయంలోనే భక్తులకు ప్రసాదం అందించడంతో ప్రక్రియ మరింత సులభంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. టికెట్ స్కాన్ అయిన వెంటనే లడ్డు అందజేయడం ద్వారా ప్రసాద పంపిణీలో పూర్తి పారదర్శకత సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

Next Story