ఎన్టీఆర్‌కు వెన్నుపోటు కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది అతడే.. విజయసాయిరెడ్డి

by Yella Dhawani Reddy |

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది అతడే.. విజయసాయిరెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర చరిత్రలోనే అతి చెత్త ఆర్థిక మంత్రి ఎవరంటే టీడీపీలో కట్టప్పగా చెప్పుకునే యనమల రామకృష్ణుడు అని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన వారిలో అతి చెత్త ఆర్థిక మంత్రి అని ట్విట్టర్ వేదికగా ఘాటుగా విమర్శించారు. ఏడాదిలో 300 రోజులకు పైగా ఓవర్ డ్రాఫ్ట్, వేస్ అండ్ మీన్స్‌కు వెళ్లిన చరిత్ర యనమలది అని విమర్శించారు. పైగా తానో పెద్ద మేధావినంటూ నీతి ప్రవచనాలు చెప్తారంటూ మండిపడ్డారు. నమ్మక ద్రోహి అయిన యనమల రామకృష్ణుడుని ప్రజలు ఏనాడో మరచిపోయారంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించిన ముద్దాయి యనమల రామకృష్ణుడేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే తునిలో ఏ ఎన్నికలోను పార్టీని గెలిపించక పోయినా యనమలకు మాత్రం చంద్రబాబు పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. ఇలాంటి ప్రజా తిరస్కృతుల వల్లే టీడీపీ భ్రష్టు పట్టిందని ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.


Next Story