రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తా...విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-18 12:19:08  IST  )

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తా...విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కావాలంటే తాను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తానని దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదని అన్నారు. తనపై వ్యంగ్యంగా కథనాలు రాస్తున్నారని తనకు నచ్చిన పనిచేస్తానని చెప్పారు. 2014 నుండి వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు పార్టీని తానొక్కడినే నడిపించానని చెప్పారు. విజయసాయి ఎప్పటికైనా వెన్నుపోటు పొడుస్తారు అంటూ తమ నాయకుడికి ఎక్కిస్తూ వచ్చారని తన పదవులు అన్నీ పోయాయని చెప్పారు. 2వ స్థానంలో ఉన్న తనను కోటరీ వేధింపులకు గురిచేసి 2వేల స్థానంలో నిలబెట్టారని అన్నారు.

చాలా న్యూస్ ఛానల్స్‌లో విజయ సాయి రెడ్డి మోసం చేసి పోయాడని రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం వల్లనే రాజీనామా చేశానని ఇకపై తనకు సంబంధించిన వార్తలు రాయవద్దన్నారు. లిక్కర్ కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డి మాత్రమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలరని అన్నారు. మొదటి మూడు నెలల్లో జరిగిన పరిణామాలే తనకు తెలుసని చెప్పారు. తాను లోన్ మాత్రమే తీశానిన ఆ తరవాత జరిగిన పరిణామాలు తనకు తెలియవని చెప్పారు. రాజ్ కసిరెడ్డి పార్టీ నేతలుగానే తనకు పరిచయం అన్నారు. కసిరెడ్డిది క్రిమినల్ మైండ్ అని అది తెలియక ప్రోత్సహించానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజ్ కసిరెడ్డిని పార్టీ నేతలే తనకు పరిచయం చేశారని అన్నారు. ఆడాన్ కంపెనీ కసిరెడ్డిది అని అన్ని ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పగలరని అన్నారు. మిథున్ రెడ్డి పాత్ర గురించి తనకు తెలియదు అని ఆయననే అడగాలని చెప్పారు. మూడు కంపెనీలను కసిరెడ్డి లీజుకు తీసుకున్నారా అని అధికారులు ప్రశ్నించినట్టు విజయసాయి రెడ్డి చెప్పారు. లిక్కర్ స్కామ్‌లో బిగ్ బాస్ ఉన్నారో లేదో తనకు తెలియదు అని అన్నారు. అసలు స్కామ్ జరిగిందో లేదో కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు.

Next Story