బంగ్లాదేశీ చొరబాటుదారులపై విజయసాయిరెడ్డి ట్వీట్‌

by Ajay Maddhiboyina |

బంగ్లాదేశీ చొర‌బాటుదారులు తిరిగి త‌మ దేశానికి వెళ్ల‌డంపై మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సోష‌ల్ మీడియాలో స్పందించారు. వేలాదిమంది అక్ర‌మ బంగ్లాదేశీ వ‌ల‌స‌దారులు బంగ్లాదేశ్ తిరిగి వెళ్ల‌డానికి హ‌కీంపూర్ స‌రిహ‌ద్దు చెక్ పోస్ట్ వ‌ద్ద నిల‌బ‌డ‌టం చూసి సంతోషించాన‌ని అన్నారు.

బంగ్లాదేశీ చొరబాటుదారులపై విజయసాయిరెడ్డి ట్వీట్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: బంగ్లాదేశీ చొర‌బాటుదారులు తిరిగి త‌మ దేశానికి వెళ్ల‌డంపై మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సోష‌ల్ మీడియాలో స్పందించారు. వేలాదిమంది అక్ర‌మ బంగ్లాదేశీ వ‌ల‌స‌దారులు బంగ్లాదేశ్ తిరిగి వెళ్ల‌డానికి హ‌కీంపూర్ స‌రిహ‌ద్దు చెక్ పోస్ట్ వ‌ద్ద నిల‌బ‌డ‌టం చూసి సంతోషించాన‌ని అన్నారు. అక్ర‌మ వ‌ల‌స దారులు భార‌తీయుల ఉద్యోగ‌ అవ‌కాశాల‌ను దెబ్బ‌తీస్తున్నార‌ని పేర్కొన్నారు. వ‌ల‌స‌దారుల‌కు భార‌త్ సుర‌క్షిత‌మైన ఆశ్ర‌యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేస్తున్న.. గుర్తించ‌డం,నిర్భంధించ‌డం, బ‌హిష్క‌రించ‌డం అనే విధానాల‌ను అభినందిస్తున్నానని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శంసించారు. ఇదిలా ఉంటే బెంగాల్ లో సర్ ప్ర‌క్రియ ద్వారా వేల‌మంది అక్ర‌మ వ‌స‌ల‌దారుల ఓట్ల‌ను తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల త‌ర‌వాత వ‌ల‌స‌దారుల‌పై ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం సువేందు అధికారి బంగ్లాదేశీలు వెళ్లిపోవాలని లేదంటూ ప్రభుత్వం రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. దీంతో చాలా మంది బంగ్లాదేశీయులు తిరిగి తమ దేశానికి వెళ్లిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story