- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్ చుట్టూ కోటరీ.. అవసరమైతే పార్టీ పెడతా: విజయసాయి రెడ్డి సంచలనం
అవరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అవరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తనకు ఏ రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, అవసరమైతే పార్టీ పెట్టేందుకు కూడా వెనకడుగు వేయనని తేల్చి చెప్పారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, తన విషయం ఆయన్ను ఆ కోటరీనే డైవర్ట్ చేస్తోందన్నారు. నిబద్ధత లేని వారి మాటల్ని జగన్ నమ్మొద్దని మీడియా ముఖంగా సూచించారు. కాగా.. గతంలో విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ను టీడీపీ సమర్థించడంపై విలేకరులు ప్రశ్నించగా.. ఇప్పటి వరకూ తనకు ఏ రాజకీయ పార్టీ నుంచీ పిలుపు రాలేదని స్పష్టం చేశారు. కానీ తనపై చాలా ఒత్తిళ్లు వచ్చాయని, వాటికి ఏమాత్రం తలొగ్గలేదని స్పష్టం చేశారు.
సైరా నరసింహారెడ్డి పేరుతో జిల్లా లేదు..
రాష్ట్రంలో పొట్టిశ్రీరాములు, అన్నమయ్య, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, వైఎస్సార్ పేర్లతో జిల్లాలు ఉన్నాయి కానీ.. సైరా నరసింహారెడ్డి పేరుతో జిల్లా లేదన్నారు. కాబట్టి కర్నూల్ జిల్లాకుఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలా చేస్తే.. స్వాతంత్ర్య సమరయోధుడైన సైరా నరసింహారెడ్డిని గౌరవించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. ఇక శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘ భవనాన్ని కట్టేందుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం తానొక రైతును మాత్రమేనని, దీనిపై ఎవరెన్ని సెటైర్లు వేసినా పట్టించుకోనన్నారు.
పవన్ కల్యాణ్ తో 20 ఏళ్లు స్నేహం
ఏపీ డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ కల్యాణ్ తో తనకు 20 ఏళ్ల స్నేహం ఉందన్నారు విజయసాయిరెడ్డి. పవన్ ను తానెప్పుడూ విమర్శించలేదని తెలిపారు. చంద్రబాబు నాయుడితో, పవన్ కల్యాణ్ తో చేతులు కలిపారని కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో పవన్ తనకు కేవలం మిత్రుడని స్పష్టం చేస్తున్నానన్నారు.






