- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijayasai: విజయసాయి.. పొలిటికల్ రీఎంట్రీ!
సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేసి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నంబర్ 2 అనిపించుకున్న, వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డి పొలిటికల్ రీయంట్రీ ఇస్తున్నారా..?

రావాలంటే వస్తా అంటూ.. వ్యాఖ్యలు
బీజేపీలో కీ రోల్ దక్కనుందా?
పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్
దిశ, డైనమిక్ బ్యూరో: సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేసి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నంబర్ 2 అనిపించుకున్న, వైయస్ జగన్ కు (YS Jagan) అత్యంత సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డి పొలిటికల్ రీయంట్రీ (Reentry)ఇస్తున్నారా..? బీజేపీలోకి (BJP) చేరుతున్నారా.? దీనిపై ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చ నడుస్తోంది. సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి విలేకరుల అడిగిన ప్రశ్నలకు పలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తాను తిరిగి రాజకీయాల్లోకి రావాలంటే ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి మళ్లీ వస్తానంటూ ప్రకటించారు. వైసీపీ పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న విజయసాయిరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన బీజేపీలో చేరుతున్నట్లు, ఆ పార్టీలో విజయసాయికి కీ రోల్ కూడా దక్కబోతోందని అంటున్నారు.
ఈ ఏడాది జనవరిలో విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి (MP) రాజీనామా చేశారు. తాను రాజకీయాలను తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. వ్యవసాయం చేసుకుంటానంటూ చెప్పారు. అయితే ఏపీలో లిక్కర్ కుంభకోణం కేసులో విజయసాయి సాక్షిగా ఉన్నారు. దీనికి సంబంధించి సిట్ ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను తిరిగి రాజకీయాల్లోకి వస్తే అభ్యంతరం ఏంటంటూ ప్రశ్నించారు.
విజయసాయి రెడ్డికి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఆయన ఆ పార్టీతో మంచి సంబంధాలను నడిపించారు. కమలం పార్టీపై ఎప్పుడూ విమర్శలు చేయలేదు. తను రాజకీయాల్లో రీఎంట్రీ ఇస్తాను అని ప్రకటించినప్పుడు.. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారనే వార్త రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొట్టింది. విజయసాయిరెడ్డి తో జగన్కు చెక్ పెట్టించాలని బీజేపీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. బీజేపీలో చేరేందుకు విజయ సాయి రెడ్డి మంతనాలు కూడా సాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ పార్టీలో చేరితే విజయ్ సాయి రెడ్డి పాత్రపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. జాతీయస్థాయిలో ఉండేందుకు ఆయన ముగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలను కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు మౌనంగా పరిశీలిస్తున్నాయి






