- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijaya saireddy: సీఐడీ విచారణకు విజయసాయి.. కాకినాడ పోర్టు కేసులో..
కాకినాడ పోర్టు అక్రమాల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడలోని తాడిగడప సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో : కాకినాడ పోర్టు (Kakinada port) అక్రమాల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai reddy) విజయవాడలోని తాడిగడప సీఐడీ (CID) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కాకినాడు పోర్టు, కాకినాడ సెజ్‌కు సంబంధించిన వాటాల బదలాయింపులో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. కాకినాడ పోర్టు సెజ్యజమానిగా ఉన్న కేవీరావు (KV Rao) ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో విక్రాంత్‌రెడ్డి మొదటి నిందితుడిగా ఉన్నారు. విజయసారి రెండో నిందితుడు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే విజయసాయిని విచారించింది. సీఐడీ అధికారుల నోటీసు మేరకు ఆయన విచారణకు వచ్చారు. ఆయనతో పాటు న్యాయవాదులు రాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. వాటాల బదలాయింపులో రూ.4 కోట్ల నష్టం జరిగిందని కేవీరావు ఫిర్యాదులో పేర్కొన్నారు. అతి తక్కువ ధరకు బెదిరించి ఈ వాటాలు బదలాయించారని తెలిపారు. ఇటీవల విక్రాంత్‌రెడ్డి బెయిల్పిటీషన్ సమయంలో సీఐడీ అధికారులు కొంత సమాచారం ఇచ్చారు. ఈ వాటాలు ఎవరు ఎవరికి బదలాయించారు.. ఎంత బదలాయించారు అనే అంశాలపై విజయసాయిని విచారణ చేయనున్నట్లు సమాచారం. దీని వెనుక వైసీపీ పెద్దలు ఉన్నట్లు భావిస్తున్నారు. నగదు ఏవిధంగా చేతులు మారాయినే విషయమై ఆరా తీయనున్నారు. ఇందుకోసం కొన్ని ప్రశ్నలకు సిద్ధం చేసినట్లు సమాచారం. సీఐడీ అధికారులు తమకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు విచారణ చేయనున్నారు.






