- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijayasa Reddy Meets Sharmila: హాట్ టాపిక్ గా షర్మిలతో విజయసారెడ్డి భేటీ!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(Andhra Pradesh Politics) విజయసాయిరెడ్డి వ్యవహారశైలీ ఇప్పుడు హాట్ టాపిక్(Hot Topic)గా మారింది. మాజీ సీఎం, వైసీసీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)కి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి తాజాగా కాంగ్రెస్ ఏపీ(AP Congrss) అధ్యక్షురాలు షర్మిలతో భేటీ(Vijayasa Reddy's Meeting With Sharmila) అయిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(Andhra Pradesh Politics) విజయసాయిరెడ్డి వ్యవహారశైలీ ఇప్పుడు హాట్ టాపిక్(Hot Topic)గా మారింది. మాజీ సీఎం, వైసీసీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)కి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి తాజాగా కాంగ్రెస్ ఏపీ(AP Congrss) అధ్యక్షురాలు షర్మిలతో భేటీ(Vijayasa Reddy's Meeting With Sharmila) అయిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారింది. ఇటీవల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, రాజ్యసభ పదవికి రాజీనామా చేసి..అనంతరం వైసీసీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి అనూహ్యంగా వైఎస్.షర్మిలతో భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో..ముఖ్యంగా వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.
విజయసాయిరెడ్డి మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో వైఎస్. షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు 3 గంటలపాటు రాజకీయ అంశాలపై చర్చించారని..మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారన్న వార్తలు వైరల్ గా మారాయి. షర్మిలను విజయసాయిరెడ్డి ఎందుకు కలిశారు..ఇక నాకు రాజకీయాలతో సంబంధం లేదని..స్నేహపూర్వక..బంధుత్వ సంబంధాలను పునరుద్ధరించుకునేందుకు వెళ్లారా లేక జగన్ కు, షర్మిలకు మధ్య నెలకొన్న ఆర్థిక వివాదాలపై మధ్యవర్తిత్వంగా సెటిల్ చేసేందుకు వెళ్లారా అన్నదానిపై రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మాజీ సీఎం జగన్ చెల్లెలు షర్మిలకు, జగన్ కు మధ్య కుటుంబ, ఆర్థిక, రాజకీయ వివాదాలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు నుంచి ముదిరిపోయాయి. ఎన్నికల అనంతరం ఆస్తుల వివాదం రచ్చ కెక్కింది. ఈ నేపథ్యంలో జయసాయిరెడ్డిపై షర్మిల ఘాటైన విమర్శలు చేసింది. వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని విజయసాయి ప్రకటించడంపైనా షర్మిల అభ్యంతరం తెలిపింది. రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసినప్పుడు.. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికైనా నిజాలు బయట పెట్టాలని షర్మిల సూచించారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి వైసీపీ నుంచి వెళ్లిపోతున్నారనీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో షర్మిలను విజయసాయిరెడ్డి కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.






