- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ కాంత్ మృతి బాధాకరం: నందమూరి బాలకృష్ణ
by Seetharam |
తమిళ సినీ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి బాధాకరం అని అగ్రనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : తమిళ సినీ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి బాధాకరం అని అగ్రనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయ్ కాంత్ అకాల మరణం ఒక్క కోలివుడ్‌కే కాదు యావత్ భారతీయ సినీ పరిశ్రమకు తీరనిలోటు అని అన్నారు. ఇనిక్కుం ఇలామై సినిమాతో కెరీర్ ప్రారంభించిన విజయ్ కాంత్ 100కు పైగా చిత్రాల్లో హీరోగా నటించి అభిమానులను అలరించారు అని చెప్పుకొచ్చారు. ఒక్క తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించారు అని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్ర వేశారు అని అన్నారు. మిత్రుడు విజయ్ కాంత్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు.
Next Story






