TTD:తిరుమలలో ‘నిరసన నినాదాలు’.. వారిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్

by Jakkula.Mamatha |

తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి క్యూలైన్‌లో ఉన్న కొందరు భక్తులు(Devotees) ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

TTD:తిరుమలలో ‘నిరసన నినాదాలు’.. వారిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమలలో శుక్రవారం అర్ధరాత్రి క్యూలైన్‌లో ఉన్న కొందరు భక్తులు(Devotees) ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తిరుమలలో సౌకర్యాలు బాగాలేవని నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆ వీడియోలు కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. దీంతో రాజకీయాల్లో మళ్లీ తిరుమల తిరుపతి దేవస్థానం చర్చనీయాంశంగా మారింది. దీనిని వైసీపీ సోషల్ మీడియా(Social Media) వేదికగా పోస్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వం, టీటీడీ పై తీవ్ర విమర్శలు చేసింది.

ఇదిలా ఉంటే.. తిరుమల(Tirumala) క్యూలైన్‌లో నినాదాలు చేసిన వైసీపీ నేత అచ్చారావు తప్పు అయిందని, తనకు జ్వరంగా ఉండడంతో ప్రస్టేషన్‌లో అలా మాట్లాడనని క్షమాపణలు కూడా చెప్పారు. అయితే అతను క్యూలైన్‌లో చేసిన నినాదాలకు సంబంధించిన వీడియోలు ఎవరు తీశారనే దానిపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ వీడియోలు తీసిన వారిపై కేసు నమోదుకు టీటీడీ సమాయత్తమైంది.

ఈ క్రమంలో టీటీడీ(TTD) ఉద్యోగులే నినాదాలను వీడియో తీసినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. భక్తుడి ముసుగులో వైసీపీ నేత నిరసనను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారని, అనంతరం తమ మొబైల్ నుంచి ఆ వీడియో డిలీట్ చేసినట్లు విచారణలో తేలింది. ఆ దృశ్యాలు చిత్రీకరించిన ఇద్దరు టీటీడీ ఉద్యోగులను విజిలెన్స్ అదుపులోకి తీసుకుంది.

Next Story