విజయవాడలో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-08 12:12:31  IST  )

విజయవాడలో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు...

విజయవాడలో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో పలు రెస్టారెంట్లు(Restaurants), హోటళ్లు(Hotels), ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీల్లో నాసిరకం ఫుడ్(Poor Food) పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు(Vigilance and food safety officers) రంగంలోకి దిగారు. ప్రముఖ ఫుడ్ సేఫ్టీ సంస్థ జీఎం ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీలో దాడులు నిర్వహించారు. నాసిరకం ఫుడ్ ప్రోడక్ట్ ఉన్నాయన్న సమాచారంతో సోదాలు చేశారు. కాలం చెల్లిన ప్రమాదకర రసాయనాలు కలిపిన పదార్థాలతో పాటు ఫుడ్ లైసెన్స్ లేకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా కాలం చెల్లిన ఉత్పత్తులను అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో పలు ఉత్పత్తులను సీజ్ చేశారు. అనంతరం కేసు నమోదు చేశారు. కేక్స్,చాక్లెట్స్,బిస్కెట్స్,బాదం పౌడర్స్,టీ పౌడర్స్ స్వాధీనం చేసుకున్నారు.

Next Story