ACB అధికారుల కస్టడీలో విడదల గోపీ.. విచారణ ప్రారంభం

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-01 05:36:41  IST  )

ఏపీ మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) మరిది విడదల గోపి (Vidadala Gopi)ని ఏసీబీ (ACB) అధికారులు ఈ నెల 24న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ACB అధికారుల కస్టడీలో విడదల గోపీ.. విచారణ ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) మరిది విడదల గోపి (Vidadala Gopi)ని ఏసీబీ (ACB) అధికారులు ఈ నెల 24న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లా (Palnadu District)లోని ఓ స్టోన్‌ క్రషర్‌ కంపెనీ (Stone Crusher Company) యజమానిని బెదిరించి డబ్బులు వసూలు కేసులో ప్రస్తుతం అతడు విజయవాడ జైలు (Vijayawada)లో రిమాండ్ ఖైదీ (Remand Prisoner)గా ఉన్నాడు. అయితే, కేసులో కీలక ఆధారాలను సేకరించేందుకు నిందితుడిని తమ కస్టడీలోకి ఇవ్వాలంటూ అధికారులు ఏసీబీ కోర్టును కోరగా.. బుధవారం న్యాయమూర్తి గోపీని రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో నిందితుడిని విచారించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు.

ఈ మేరకు ఇవాళ ఉదయం ఏసీబీ అధికారులు విడుదల గోపీ (Vidadala)కి విజయవాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం అతడిని గొల్లపూడిలోని ఏసీబీ (ACB) కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడి విచారిస్తున్నారు. పల్నాడు జిల్లా (Palnadu District) పరిధిలో ఉన్న ఆయా స్టోన్ క్రషర్ కంపెనీ యాజమాన్యాల నుంచి ఎంత డబ్బు వసూలు చేశారు, అలా చేయమని చెప్పిందెవరు అనే విషయాలపై ప్రశ్నించి నిందితుడు ఇచ్చే స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Next Story