- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాధితులను ఆదుకోవాలి.. బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై మాజీ సీఎం దిగ్భ్రాంతి
బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (YSR Congress Party President YS Jagan Mohan Reddy) విచారం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (YSR Congress Party President YS Jagan Mohan Reddy) విచారం వ్యక్తం చేశారు. ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా (Anakapally District) కోటవురట్ల మండలంలోని కైలాసపట్నంలో ఓ బాణాసంచా తయారీ కేంద్రం (Fireworks manufacturing center)లో భారీ అగ్ని ప్రమాదం (Huge Fire Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిసింది. ప్రమాద ఘటన పట్ల మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడటం విచారకరమన్నారు. మరణించినవారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని (Deep Condolences) తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు తోడుగా నిలవాలని వైసీపీ నాయకులను ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదం గురించి పార్టీ నాయకులను ఆరా తీశారు. ఘటనాస్థలానికి వెళ్లి, సహాయంగా నిలవాలని వైసీపీ శ్రేణులను జగన్ ఆదేశించారు.






