- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్.. స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్ BR నాయుడు
by Kema Shiva Kumar |
భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో విశిష్ట అతిథిగా పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ (Radhakrishnan) ఇవాళ ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (B.R. Naidu), ఈవో ముద్దాడ రవిచంద్ర, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు మెంబర్లు భాను ప్రకాష్ రెడ్డి, తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణణ్‌కు పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ మేరకు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు శ్రీవారి చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అందజేశారు.
Next Story






