శ్రీకాకుళం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

by Naga Rani Yarlagadda |

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మరణించారు.

శ్రీకాకుళం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మరణించారు. ఈ ఘటనపై ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనలో ఇలా ప్రాణనష్టం జరగడం చాలా బాధకరమన్నారు. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో ఉన్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

ప్రమాదంలో మరణించినవారి వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతులు చిన్నమ్మ (50), విజయ (48), లీల (60), యశోద (56), రాజేశ్వరి (60), రూప, నిఖిల్ (13), బృందావతి (52), అమ్ములు (55)గా గుర్తించారు. 2 వేల మంది భక్తులు వచ్చే ఆలయానికి సుమారు భారీ సంఖ్యలో భక్తులు రావడం వచ్చే ఈ తొక్కిసలాట జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు.

Next Story