Shocking: తిరుపతిలో సాయి బాబా విగ్రహం నుంచి విభూది

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-12 13:05:08  IST  )

తిరుపతిలోని ఓ ఇంట్లో సాయి బాబా విగ్రహం నుంచి విభూది వస్తోంది....

Shocking: తిరుపతిలో సాయి బాబా విగ్రహం నుంచి విభూది
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లోని ఓ ఇంట్లో సాయి బాబా విగ్రహం(Saibaba Idiol) నుంచి విభూది(Vibhudi) వస్తోంది. గురువారం రాత్రి నుంచి స్వామి విగ్రహం నుంచి విభూది ఉద్బవిస్తోందని ఆ ఇంటి భక్తులు చెబుతున్నారు. షిర్డి నుంచి సాయిబాబా విగ్రహం తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటివరకూ నాలుగు సార్లు విగ్రహం నుంచి సువాసనతో కూడిన విభూది వచ్చిందని తెలిపారు. తాము కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత రెండు సార్లు విభూది వచ్చిందని చెప్పారు.


మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఈ విభూది ఉందని తెలిపారు. అరడుగు ఉన్న విగ్రహం తలపై ఉన్న కిరీటం నుంచి విభూది వస్తోందని, స్వామి వారి తల నుంచి కింద ఉన్న పీఠంపై పడుతోందని పేర్కొన్నారు. స్వామివారి అనుగ్రహం తమ కుటుంబంపై ఉందని కుటుంబంలోని మహిళలు తెలిపారు. అయితే సాధారణంగా చెట్ల నుంచి పాలు కారడం లాంటివి కనిపిస్తుంటాయి. అలాంటిది సాయి బాబా విగ్రహం నుంచి విభూది రాలడంతో స్థానికులు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అదంతా సాయిబాబా మహిమేనని చెబుతున్నారు.

Next Story