- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VSR:‘చాలా సంతోషంగా ఉన్నా’.. విజయసాయిరెడ్డి ఆసక్తికర పోస్ట్!(ఫొటోస్ వైరల్)
వైసీపీ(YSRCP) కీలక నేత విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ(YSRCP) కీలక నేత విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాపై పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మాజీ సీఎం జగన్(Former CM Jagan) లండన్(London) పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎందుకు రాజీనామా చేశారనే విషయం మాత్రం తెలియరాలేదు. ఇటీవల ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలను కూడా స్వీకరించారు. ఈ క్రమంలో ఇలా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏంటని వైసీపీ శ్రేణులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఈ క్రమంలో తాను ఏ పార్టీలో చేరడం లేదని.. వ్యక్తిగతంగా తీసుకుంటున్న నిర్ణయంగా పేర్కొన్నారు. ఈ తరుణంలో తాను భవిష్యత్‌లో వ్యవసాయం చేసుకుంటానని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే.. విజయసాయిరెడ్డి చెప్పినట్టుగానే వ్యవసాయ రంగం(Agriculture sector)లోకి ఎంట్రీ ఇచ్చారు. తాను వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభించినట్టు విజయసాయిరెడ్డి తాజాగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. ‘‘నా ఉద్యాన పంటల కార్యకలాపాలను తాజాగా ప్రారంభించానని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను’’ అంటూ పేర్కొన్నారు. అయితే ఆ ఫొటోలో ఓ జీప్, సింపుల్ డ్రెస్ తో విజయసాయి రెడ్డి కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో(Social Media) వైరల్‌గా మారాయి.






