- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vamsi Bail: వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ.. తీర్పు రిజర్వ్
గన్నవరం టీడీపీ కార్యాలయం (Gannavaram TDP Office)పై దాడి కేసులో కూడా బెయిల్ ఇవ్వాలని వంశీ తరపు లాయర్ విజయవాడ కోర్టు (Vijayawada Court)లో పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamsi) నిన్న (మే 13) ముదునూరి సత్యవర్థన్ కిడ్నాప్ కేసు (Satya Vardhan Kidnap Case)లో బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆయనతో పాటు మరో ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినా వంశీ జైల్లోనే కొనసాగుతున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయం (Gannavaram TDP Office)పై దాడి కేసులో కూడా బెయిల్ ఇవ్వాలని వంశీ తరపు లాయర్ విజయవాడ కోర్టు (Vijayawada Court)లో పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. వంశీ తరపున, ప్రభుత్వం తరపున వాదనలు విన్న కోర్టు.. బెయిల్ పై తీర్పును రిజర్వ్ చేసింది. మే 16న తుది ఉత్తర్వులు వెల్లడిస్తామని తెలిపింది.
కాగా.. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉండగా.. ఐదుగురు బెయిల్ పొందారు. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీతోపాటు ఓలుపల్లి మోహన రంగారావు అలియాస్ రంగా, నిమ్మ లక్ష్మీపతి, గంటా వీర్రాజు, వేలూరి వంశీబాబులకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు మూడురోజుల్లోగా రూ.50 వేలతో రెండు షూరిటీలను సమర్పించాలని, ప్రతి శనివారం పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని ఆదేశించింది.






