- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News:మాజీ మంత్రి కస్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ జిల్లా కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను ఈనెల(జూన్) 5వ తేదీన విచారించనుంది. ఇదిలా ఉంటే.. ఇదే కేసులో కాకాణిని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు.
ఈ తరుణంలో పోలీసుల పిటిషన్ పై నెల్లూరు ఎస్సీ, ఎస్టీ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో కాకాణిని కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ(మంగళవారం) ఇరువురి వాదనలు విన్న కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి కాకాణి కస్టడీ పిటిషన్ పై నెల్లూరు ఎస్సీ, ఎస్టీ ఐదో అదనపు కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే..కాకాణిపై క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, గిరిజనులను బెదిరించడం వంటి కేసులు నమోదయ్యాయి.






