- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తీర్పు వాయిదా
కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తీర్పు వాయిదా పడింది...

దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వం హయాంలో దళిత వ్యక్తి, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం(Driver Subramaniam) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు(Rajahmundry SC and ST Court)లో ఈ కేసు విచారణ జరిగింది. ఈ కేసు నిందితుడు అనంతబాబు(Anantha Babu) విచారణను కొనసాగించాలని బాధితుల తరపున ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. విచారణ కొనసాగింపుపై తీర్పును కోర్టు ఈ నెల 22కు వాయిదా వేసింది.
కాగా 2002 మే 19న రాత్రి అప్పటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్‌గా పని చేసి సుబ్రహ్మణ్యం దారుణ హత్యకు గురయ్యారు. అనంతరం మృతదేహాన్ని కారులో పెట్టి ఇంటి వద్ద వదిలివెళ్లిపోయారు. దీంతో ఈ కేసు అప్పట్లో పెనుసంచలనంగా మారింది. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ పై విడుదల అయ్యారు. అయితే ఈ కేసులో అనంతబాబు విచారణ కొనసాగింపుపై వాదనలు ముగిశాయి. తీర్పు వాయిదా పడింది.






