- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయ పోరాటం చేస్తా.. ప్రభుత్వ సర్వీస్ డిస్మిస్‌పై స్పందించిన వెంకట్రామిరెడ్డి
తనను ఉద్యోగం నుంచి ప్రభుత్వం డిస్మిస్ చేయడంపై ఆంధ్రప్రదే సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వం తనను అడ్డగోలుగా డిస్మిస్ చేసిందని, తాను న్యాయపోరాటం చేస్తానని ఆయన చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి(Secretariat Employees Association Former President K. Venkatrami Reddy)ని ప్రభుత్వం ఉద్యోగం నుండి డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై ఆయన స్పందించారు. ప్రభుత్వం తనను అడ్డగోలుగా డిస్మిస్ చేసిందని, తాను న్యాయపోరాటం చేస్తానని ఆయన చెప్పారు. గత రెండెళ్లుగా తాను సస్పెన్ లో ఉన్నానని, మరో 14 ఏళ్ల పాటు తనకు సర్వీస్ ఉందని తెలిపారు. గత ఎన్నికల్లో తాను వైసీపీకి ప్రచారం చేయలేదన్నారు. 2014-19లో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా పని చేశారని, కానీ వాళ్లెవరినీ డిస్మిస్ చేయలేదన్నారు. ఉద్యోగులు ప్రశ్నించకూదడనే తనపై వేటు వేసిందని తెలిపారు. తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనని ఎక్కడా ఆధారాలు లేవని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.






