- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధితులకు ఇన్సూరెన్స్ ఇస్తాం: బస్సు ప్రమాదంపై స్పందించిన కావేరి ట్రావెల్స్ యజమాని
కర్నూలు బస్సు ప్రమాదంపై కావేరీ ట్రావెల్స్ యజమాని వెంకటేశ్వర్లు స్పందించారు...

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kuranool District) చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు(Vemuri Kaveri Travels Bus) ఘోర ప్రమాదానికి గురైంది. బైక్(Byke)ను ఢీకొట్టి 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనలో 20 మందికి సజీవదహనం కాగా.. 12 మందికి కర్నూలు జీజీహెచ్(Kurnool GGH)లో చికిత్స అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు డోర్ వైపు నుంచి మంటలు చెలరేగడంతో కొందరు ప్రయాణికులు వెనుక వైపు ఉన్న ఎమర్జెన్సీ తలుపులు తెరిచి బయటకు వెళ్లిపోయారు. దీంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ రాలేని వాళ్లు మంటల్లో కాలి బూడిదై పోయారు.
అయితే ఈ ఘటనపై కావేరి ట్రావెల్స్ యజమాని వెంకటేశ్వర్లు స్పందించారు. ‘‘బస్సును బైక్ ఢీకొట్టి పడిపోయింది. డోర్ వద్ద మంటలు చెలరేగడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. డ్రైవర్లు స్పందించి రాడ్లతో అద్దాలు పగలకొట్టారు. బస్సుకు ఫిట్ నెస్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ ఉన్నాయి. బస్సు పేపర్లు అన్ని ఉన్నాయి. పుకార్లు నమ్మొద్దు. బాధిత కుటుంబాలకు కంపెనీ తరపున ఇన్య్సూరెన్స్ అందిస్తాం.’’ అని వెంకటేశ్వర్లు తెలిపారు.






